వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత్, ఆస్ర్టేలియా మధ్య జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు విశాఖ వేదికవుతున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అని ఏసీఏ కార్యదర్శి గోపీనాధరెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్, పోర్టు అథారిటీ చైర్మన్, పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులతోపాటు ఏసీఏ, వీడీసీఏ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం.సుమారు 15 నెలల తర్వాత టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పిచ్ (వికెట్), అవుట్ ఫీల్డ్‌పై ప్రత్యేక శ్రద్ధ చేపట్టారు. స్థానిక క్యూరేటర్‌తోపాటు సుమారు 40 మంది సిబ్బంది పిచ్, అవుట్ ఫీల్డ్‌ను తీర్చిదిద్దుతున్నారు అని తెలిపారు.