ప్రపంచకప్ 2023లో భాగంగా ఈనెల 15వ తేదీన తొలి సెమీస్ పోరులో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే ముంబైలో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ తీపి కబురు అందించింది. రేపు ముంబైలో వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. ముంబైలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు, 34 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది.