క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య(ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్లో 38 ఏళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1000-416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిపై గెలుపొందాడు.
ఐబీఎస్ఎఫ్ నిర్వహించిన వరల్డ్ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్లో భారత దిగ్గజ ఆటగాడు పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ 1000-416 పాయింట్ల తేడాతో భారత ఆటగాడు సౌరవ్ కొఠారీపై గెలిచాడు. గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్లో 8 సార్లు, లాంగ్ ఫార్మాట్లో 8 సార్లు, స్నూకర్‌లో 8 సార్లు, టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ టైటిల్స్ సాధించాడు.