పాక్ పురుషుల క్రికెట్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా మాజీ ఆటగాళ్లు ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లను నియమితులయ్యారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లకు ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది.