అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ఆంజెల్ డి మరియా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఏడాది తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు మరియా వెల్లడించారు. వచ్చే ఏడాది అమెరికాలో జరిగే కోపా అమెరికా కప్ తర్వాత ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటారని మరియా తెలిపాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో మరియా 78వ నిమిషంలో గోల్ చేశాడు. దాంతో అర్జెంటీనా 1-0 స్కోర్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసింది.
కోపా అమెరికా కప్‌లో మీరు చివరిసారిగా అర్జెంటీనా జెర్సీని ధరించబోతున్నారా? బరువెక్కిన హృదయంతో నాకిష్టమైన జెర్సీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. బ్రెజిల్‌తో మ్యాచ్‌లో స్టాండింగ్ ఒవేషన్‌ను మర్చిపోలేను. జట్టు సభ్యులతో ప్రతి సెకనును ఆస్వాదించాను. అవి లేకుంటే నా ప్రయాణం అర్థరహితం. టీమ్‌లోని ప్రతి ఒక్కరి మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని మరియా భావోద్వేగానికి గురైంది.