వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత జరిగిన ఓ చేదు అనుభవాన్ని టీమిండియా ప్లేయర్ అశ్విన్ తాజాగా పంచుకున్నారు. ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఏడ్చారని అశ్విన్ తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ 'ఫైనల్లో ఓడిన తర్వాత చాలా బాధపడ్డాం. రోహిత్, కోహ్లిని అలా చూస్తుంటే చాలా బాధేసింది. రోహిత్ అద్భుతమైన కెప్టెన్. చాలా ఎఫర్ట్స్ పెడతాడు. WCలో ముందుండి నడిపించాడు' అని తెలిపారు.