ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెను మరింత ఆరోగ్యంగా ఉంచుకోండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 12:33 PM

గుండెను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- వెన్న తీసిన పాలతో చేసిన పెరుగులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఖనిజ లవణాలెన్నో ఉంటాయి. ఇవి గుండెపోటును అదుపులో ఉంచుతాయి.
- గింజపప్పుల్లో (నట్స్‌) వృక్ష రసాయనాలు, గుండెకు మేలు చేసే కొవ్వు, పీచు ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోజుకు అరకప్పు అక్రోట్లు తినేవారి రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
- చిక్కుడు జాతి కూరగాయల్లో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు రెండు రకాల పీచూ ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూస్తుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన భావన కలిగిస్తూ బరువు అధికంగా పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌, అధిక బరువు రెండూ గుండె జబ్బు ముప్పు కారకాలే మరి.
- సముద్ర చేపల్లో హాని కలిగించే కొవ్వు తక్కువగా ఉంటుంది. గుండె స్థిరంగా కొట్టుకోవటానికి, రక్తపోటు తగ్గటానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయటానికి తోడ్పడే ఒమేగా 3 కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియమూ ఎక్కువగానే ఉంటాయి.
- పాలకూర వంటి ఆకుకూరలతో నైట్రేట్లు లభిస్తాయి. వీటిని మన శరీరం నైట్రిక్‌ ఆక్సైడ్‌ గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగటానికి, రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరలో వృక్ష రసాయనాలు, పీచు, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే ఫోలేట్‌ అనే బి విటమిన్‌ కూడా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com