టీమిండియా ప్రధాన కోచ్‌గా ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రావిడ్‌ను తిరిగి కొనసాగించనున్నట్టు బీసీసీఐ ఇటీవల అధికారికంగా తెలిపింది. ఆయనతో పాటు స్టాఫ్ కాంట్రాక్టును కూడా పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఎంతకాలం అనేది తెలపలేదు. ఈ అంశంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ ముగించుకొని భారత్ తిరిగొచ్చాక ద్రావిడ్‌తో చర్చించి ప్రధాన కోచ్ పదవీ కాలాన్ని నిర్ణయిస్తామని షా స్పష్టం చేశారు.