శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక పదవిని కట్టబెట్టింది. శ్రీలంక క్రికెట్ బోర్డు సనత్ జయసూర్యను సలహాదారుగా నియమించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. కాగా జయసూర్య లంక జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ముఖ్యంగా 1996 ప్రపంచకప్ తర్వాత అతని ఆట తారాస్థాయికి చేరుకుంది. జయసూర్య 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్లో ముంబై తరఫున ఆడాడు.