దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ను గెలుస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారని, తమ వంతు పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. కాగా, సఫారీ దేశంలో భారత జట్టు ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. అయితే ఈసారి అసాధ్యాలను సుసాధ్యం చేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా ఉంది.
ఈ సందర్భంగా తన టీ20 భవిష్యత్తు గురించి స్పందిస్తూ.. ''నాకు ఆడేందుకు అవకాశం ఉన్న అన్ని చోట్లా క్రికెట్ ఆడుతూనే ఉంటాం. అందరికీ ఆడాలనే ఉంటుంది. నా టి20 భవిష్యత్తు గురించి త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్-2022 ముగిసిన తర్వాత హిట్మ్యాన్ ఇంత వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే.