భారత జట్టుతో టెస్టు సిరీస్ ను ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3వ తేదీ నుండి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కు పేసర్ కోయెట్జీ కటి వాపు కారణంగా దూరం కానున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొలి టెస్టు రెండు ఇన్సింగ్స్ లో కోయెట్జీ కేవలం ఒక వికేట్ మాత్రమే తీశారు. దీంతో అతడి స్ధానంలో మరో పేసర్ లుంగీ ఎంగిడిని తీసుకోనున్నారు.