కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో ఓటమికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది టీమిండియా. అయితే, భారత స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్రాక్టీస్ చేస్తుండగా భుజానికి గాయమైంది. ఈ క్రమంలో శార్దూల్ స్థానంలో రెండో టెస్టులో అవేశ్ ఖాన్ ఆడే అవకాశం ఉంది. అలాగే, ప్రసిద్ధ్ స్థానంలో ముఖేష్ కుమార్‌ను టీంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.