టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరి కొన్నాళ్లపాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న సూర్యకు హెర్నియా సమస్య ఉన్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఒక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్ జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చు.