భారత పర్యటనకు ముందు అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్‌లపై విధించిన ఆంక్షలను ఎత్తేసింది. గతంలో తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దని బోర్డుకు వద్దని తెలపడంతో దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనందున.. ఐపీఎల్‌తోపాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడకుండా వీళ్లపై బోర్డు రెండేళ్లపాటు నిషేధం విధించింది.