ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఉన్న భావనారాయణ స్వామి దేవాలయంలో ఓ వింత జరుగుతోంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో చలికాలం వెచ్చగానూ, ఎండాకాలంలో చల్లగానూ ఉంటుందట.
ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం చోళరాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తోంది. దేవాలయంలోని స్వామి విగ్రహం కాలి మునివేళ్లపై నిలబడి ఉండటం విశేషం. అయితే ఆనాటి ఈ ఆలయ టెక్నాలజీ ఇప్పటికీ అర్థం కావడం లేదట.