మొక్కజొన్నతో తయారు చేసిన పాప్‌కార్న్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంతో సహా మలబద్ధకం నివారణలో సహాయపడుతుందని పేర్కొన్నారు. పాప్‌కార్న్‌లోని ఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అలాగే చర్మంపై ముడతలు పడకుండా చేసి యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.