గేదె, ఆవు పాల కంటే మేక పాలు త్వరగా జీర్ణం అవుతాయి. శరీరంలో జీర్ణ క్రియకు కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో రెండు బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి.మేక పాలల్లో మెగ్నీషియం, క్యాల్షియం వంటివి అధికంగా ఉంటాయి. ఇవి తాగడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. పిల్లలకు ఇవి ఇస్తే చాలా మంచిది. వారు బలంగా, దృఢంగా తయారవుతారు. ఆవు పాలల్లో లభించే వాటి కన్నా ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు శరీరం ఈ ఖనిజాలను సమర్థవతంగా గ్రహిస్తుంది.