నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇందులో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడుతుంది. అంతేకాదు.. నారింజ జ్యూస్ తాగడం వల్ల మన జీవితకాలం పెరుగుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు. రోజూ రెండు గ్లాసుల నారింజ జ్యూస్ తాగితే ఊబకాయం తగ్గుతుందని, గుండె సమస్యలు, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.