యాపిల్ కట్ చేసిన తర్వాత యాపిల్ ముక్కలకు నిమ్మరసం రాయాలి. ఇలా చేస్తే నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్ రంగు మారకుండా చేస్తుంది. యాపిల్ ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఎర్రగా మారకుండా తాజాగా ఉండటానికి ఉప్పు నీరు కూడా బాగా సహాయపడుతుంది. ముక్కలు కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేయాలి. కొద్దిసేపు ఉప్పు నీటిలోనే ఉంచాలి. ఆ తరువాత ముక్కలను బయటకుతీసి సాధారణ నీటితో కడిగి ఆరబెట్టితే రంగు మారకుండా ఉంటాయి.