బెండకాయలు ఫోలేట్, విటమిన్-సి, కె, ఫైబర్ సమృద్ధిగా లభించే పోషకాహారం. ఇందులో క్యాలరీలు తక్కువ. ఉడికించుకుని, వేయించుకుని, పచ్చిగా కూడా తినొచ్చు. అయితే, బెండకాయతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తరచూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెండలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పేగులకు సంబంధించిన జబ్బుల ముప్పు తగ్గిస్తుంది. ఆస్తమాతో బాధపడేవారు బెండకాయలు తింటే మంచిది.
శరీరానికి అవసరమైన ఎన్నో రకాల ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ పెరుగు ద్వారా లభిస్తాయి. పెరుగులోని మంచి కొవ్వు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులోని కాల్షియం తలనొప్పి తగ్గించడంలో క్రీయాశీలకంగా ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. దంతాలు ఆరోగ్యంగా మారుతాయి. పెరుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అసిడీ, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలకు పెరుగుతో చెక్ పెట్టొచ్చు.