ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ’’క్రాలీ ఎల్బీ కోసం కుల్దీప్ కోరిన రివ్యూలో డీఆర్ఎస్ సరిగా చూపించలేదు. బంతి పడ్డ కోణం చూస్తే లెగ్ స్టంప్‌ను దాటి వెళ్లేలా కనిపించింది. కానీ బాల్ ట్రాకర్ మాత్రం బంతి స్టంప్‌ను తాకినట్లు చూపించింది. టెక్నాలజీపై పూర్తి నమ్మకం లేక అంపైర్ కాల్ పెట్టుకున్నాం’’ అని చెప్పాడు.
భారత్ స్పిన్నర్ అశ్విన్ రికార్డుకు థర్డ్ అంపైర్ బ్రేక్ వేశాడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయికి చేరతారని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. గత టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ హార్టీని ఔట్ చేయగా, అతడు డిఆర్ఎస్ తీసుకున్నారు. అందులో అంపైర్స్ కాల్ వచ్చింది. అయితే విచిత్రంగా థర్డ్ అంపైర్ అతడిని నాటౌట్ గా ప్రకటించారు. దీనిపై కెప్టెన్ రోహిత్ సైతం ఆశ్చర్య వ్యక్తం చేశారు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 499 టెస్టు వికెట్లు ఉన్నాయి.