ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని వైయస్ఆర్‌సీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశాడు. ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15 వేలు అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. హమీల గురించి ప్రశ్నిస్తున్నవారిని అరెస్ట్‌లు చేయిస్తున్నాడు’’ అంటూ పోసాని నిలదీశారు. నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్‌లో యెల్లో మీడియా కథనాలు ఉన్నాయి. నేను సైకో అని.. పార్టీలు మారతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరు వందల వాగ్ధానాలు చేశాడు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు. నాలాంటి వాళ్లను తిట్టినందుకు ఆయనకి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు.అని పోసాని అన్నారు.