సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు మార్కు వంచనకు ఈ బడ్జెట్ నిలువెత్తు సాక్ష్యమంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఎండగట్టింది.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది . ఇది ప్రజలు మెచ్చే బడ్జెట్ కాదు.. ఇది వంచన బడ్జెట్. సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయింపులు లేవు. ఆద్యంతం అబద్ధాలు.. అవాస్తవాలు..వక్రీకరణల సమాహారమే ఈ బడ్జెట్. ఎంతో గొప్ప బడ్జెట్ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెబుతున్నారు. వారిని వైయస్ఆర్సీపీ కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. దమ్ముంటే వీటికి సమాధానం చెప్పాలని ఎక్స్ వేదికగా కూటమి నేతలకు సవాలు విసిరింది.