సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఒక పాచిపోయిన లడ్డూ బడ్జెట్.. వైయస్ జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని కూటమి నేతలు పదే పదే మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటో బడ్జెట్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పులు 6 లక్షల కోట్లు కూడా లేవు. తల్లికి వందనం, రైతు భరోసాకు అరకొర కేటాయింపులే చేశారు. దేశ చరిత్రలో 5 నెలలు తర్వాత బడ్జెట్ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’’ అని వెల్లంపల్లి అన్నారు.