వంటల్లో వాడే నూనెలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని వంట నూనెలు వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవనూనె, అవకాడో నూనెలు పొట్ట తగ్గడానికి ఎంతో బాగా పనిచేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ఈ నూనెలు తగ్గిస్తాయి.
నెయ్యితో ప్రయోజనాలివే: చాలా రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. మనకు అవసరమైన ప్రోటీన్ కూడా ఉంటుంది. బోన్ స్ట్రెంత్, కంటి చూపు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడుతుంది. అంతేకాదు నెయ్యి తీసుకుంటే అరుగుదల సమస్యలు రాకుండా ఉంటాయి. డయోరియా లాంటి సమస్యలు కూడా రావు.