డ్రైఫ్రూట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీడిపప్పు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొందరు నమ్మకం. జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే దాంట్లో ఏమాత్రం నిజం లేదు. జీడిపప్పు ఖచ్చితంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండడంతో పాటు కాళ్ల నొప్పులు దూరమవుతాయి. జీడిపప్పు తినడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గిస్తుంది.