ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గుల్వీర్ సింగ్ జరుగుతున్న పోటీల ముగింపు రోజు 3000 మీటర్ల ఫైనల్ రేసులో విజయం సాధించి భారత్‌కు నాలుగో బంగారు పతకాన్ని అందించాడు. నాన్ ఒలింపిక్ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో గుల్వీర్ 8 నిమిషాల 07.48 సెకన్లతో పోడియం పైన నిలిచాడు.కిర్గిస్థాన్‌కు చెందిన కెనెష్‌బెకోవ్ నూర్సుల్తాన్ (8:08.85), ఇరాన్‌కు చెందిన జలీల్ నసేరి (8:09.39) వరుసగా రజతం, కాంస్యం సాధించారు. అంతకుముందు మహిళల 3000 మీటర్ల రేసులో అంకిత 9:26.22తో రజత పతకాన్ని గెలుచుకుంది.కజకిస్థాన్‌లోని అస్తానాలో గత ఎడిషన్‌లో దేశం ఒక స్వర్ణం, ఆరు రజతం మరియు ఒక కాంస్యాన్ని గెలుచుకుంది.