రాంచీ వేదికగా ఈనెల 23 నుంచి ఇంగ్లాండ్-భారత్ 4వ టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో 2, 3 మార్పులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్టు, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాటీదార్ స్థానంలో రాహుల్, బుమ్రా ప్లేస్‌లో ముకేశ్/ఆకాశ్ దీప్ ఆడే ఛాన్స్ ఉంది. ఒక వేళ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే పేసర్‌కి బదులు స్పిన్నర్‌ను(అక్షర్/ సుందర్) తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా 4వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తో సొంతం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో గాయం కారణంగా గత 2 టెస్టులకు దూరమైన భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు 4వ టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌పై వేటు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.