భారత పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు మిడిలార్డర్ వైఫల్యంతో వరుస ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో ఫ్యాబ్ 4లో ఒకడైన జో రూట్ వైఫల్యం పై అందరి దృష్టి పడుతోంది. దీనికి కారణం అతడిపై ఆల్‌రౌండర్‌గా భారం మోపడమే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయమై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ బట్చర్ స్పందిస్తూ.. ఇంగ్లాండ్ జట్టు తమ అత్యుత్తమ బ్యాటర్‌ను ఆల్‌రౌండర్‌గా మార్చేసి భారీ మూల్యం చెల్లించిందని అన్నాడు.
రాంచీ వేదికగా ఈనెల 23 నుంచి ఇంగ్లాండ్-భారత్ 4వ టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో 2, 3 మార్పులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్టు, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాటీదార్ స్థానంలో రాహుల్, బుమ్రా ప్లేస్‌లో ముకేశ్/ఆకాశ్ దీప్ ఆడే ఛాన్స్ ఉంది. ఒక వేళ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే పేసర్‌కి బదులు స్పిన్నర్‌ను(అక్షర్/ సుందర్) తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.