సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఎంతసేపు నిద్ర పోయాం అనేదాని కన్నా.. ఎంత గాఢంగా నిద్రపోయాం అన్నదే చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో గాఢత లోపిస్తే జ్ఞాపక శక్తి మందగిస్తుందట. అంతేకాక, శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వకపోతే అల్జీమర్స్ వచ్చే అవకాశముందట. ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రతినిధులు 526 మంది స్త్రీపురుషులను అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించింది.