అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాజ్ కోట్ టెస్టు మ్యాచ్ తో సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీలోనే ఆదరగొట్టేశాడు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత భారత జట్టులో వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ (26) సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన 4వ భారత ఆటగాడిగా నిలిచాడు. ముంబయి మైదానాల్లో ఆఫ్, లెగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల బౌలింగ్ లో ప్రతి రోజూ 500 బంతులు ఎదుర్కోవడం వల్లే రాజ్ కోట్ లో సర్ఫరాజ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని, ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని సర్ఫరాజ్ సన్నిహితులు చెబుతున్నారు.