భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి యూవీ పోటీ చేస్తారని సమాచారం. తాజాగా యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు. ఈ నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై యువరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు.
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ఈ స్టార్ ఆటగాడు కొన్ని లీగ్‌లలో మాత్రమే కనిపిస్తాడు. ఇది ఇలా ఉంటే…. యువీ పబ్లిక్ ఫీల్డ్ లోకి వస్తాడనే వార్తలు వస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున యువీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా యువీ తల్లి షబ్నం సింగ్‌తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. దాంతో ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు ఈరోజు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై యువరాజ్ ఇంకా స్పందించలేదు. గురుదాస్‌పూర్ నుంచి బాలీవుడ్‌కి చెందిన వినోద్ ఖన్నాలు, సన్నీడియోల్‌లు ఎంపీగా గెలిచారు. మరి వీరి జాబితాలో యువీ చేరతాడా? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. మన దేశంలో క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు.