బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ, అది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. మీరు కిడ్నీలో రాళ్లను తొలగించే ప్రక్రియలో పదేపదే బీర్ తాగుతూ ఉంటే.. అది మూత్రపిండాల సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, రక్తపోటు, క్యాన్సర్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని అన్నారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక చుక్క ఆల్కహాల్ కూడా ప్రమాదకరమైనదిగా పరిగణించింది.