భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ జట్టు గెలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఆతర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు జో రూట్ 122 పరుగులు, అలీ రాబిన్ సన్ 58 పరుగులు, ఫోక్స్ 47 పరుగులు, జాక్ క్రాలే 42పరుగులు చేశారు. భారత్ బ్యాట్స్ మెన్లు ధ్రువ్ జురెల్ 90 పరుగులు, జైస్వాల్ 73 పరుగులు, శుభమాన్ గిల్ 38 పరుగులు చేశారు.ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 145 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 192 పరుగులు చేయాల్సి ఉంది. ఆతర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని ఛేదించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ లు హాఫ్ సెంచరీలు చేశారు. ఓ దశలో ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత ధ్రువ్ జురెల్, శుభమాన్ గిల్ లు జట్టును ఆదుకుని గెలిపించారు.ఐదు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. దీంతో సిరీస్ ను భారత్ జట్టు 3-1 తేడాతో కైవసం చేసుకుంది.