స్వదేశంలో ఇంగ్లండ్‌పై భారత్ మరోసారి విజయం సాధించింది. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3-1తో కైవసం చేసుకుంది.
రాంచీ టెస్టులో టీమిండియా 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. అయితే ఓవర్ నైట్ స్కోరు 40/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ట్రాప్ లో చిక్కుకోవడంతో భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు.
120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) క్యాచ్ పట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 72 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (55) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.