ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో సొంతగడ్డపై తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. వరుసగా స్వదేశంలో రికార్డు స్థాయిలో 17వ టెస్టు సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో భారత్ 2012లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌ను కూడా భారత జట్టు డ్రా చేసుకోలేదు. అన్ని సిరీస్‌లలో జయకేతనం ఎగురవేసింది.
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టుల్లో భారత గడ్డపై 150 పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా విజయవంతంగా చేధించడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. భారత్ చివరగా 2013లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 150 ప్లస్ టార్గెట్‌ను ఛేదించింది. తాజా విజయంతో చెత్త రికార్డును భారత్ చెరిపేసింది.