మంచం మీద భోజనం చేయటం వల్ల అజీర్ణం ఎక్కువగా తలెత్తుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది. ఇది మరింత జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు కనిపిస్తాయి. అందుకే ఎప్పుడూ కుర్చీలో నిటారుగా కూర్చుని తినాలి. లేదంటే నేలపై నిటారుగా కూర్చొని తింటే ఈ సమస్య తలెత్తదు. ఇది ప్రేగులకు మేలు చేస్తుంది.