బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గడం కోసం సజ్జలు పాత్ర గురించి తెలుసుకుందాం. సజ్జల్లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్య పోషకాలు కలవు. సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.చాలా సమయం వరకూ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే జంక్ ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ ఉండవు. అందువల్ల సజ్జలు తీసుకుంటే జీవక్రియ మెరుగై బరువుని తగ్గించడంలో ఉపయోగ పడతాయి.