యువ ఆటగాళ్లకు బీసీసీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. రంజీలు ఆడకుండా మొండికేసిన ఇషాన్, శ్రేయాస్ ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుండి తప్పించింది. ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకుని దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారికి ఇది గట్టి హెచ్చరిక అని విశ్లేషకులు అంటున్నారు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న సీనియర్లు రంజీలు ఆడటం అనేది కష్టమే. అయితే, కుర్రాళ్లు కూడా అదే తీరున ఉండటం చాలా పెద్ద తప్పు అని అభిప్రాయపడుతున్నారు
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కని విషయం తెలిసిందే. దీనిపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘‘క్రికెట్‌లో ఇలాంటివన్నీ సహజమే. స్ఫూర్తితో పునరాగమనం చేయాలి. శ్రేయస్, ఇషాన్ బాధపడొద్దు. జాతీయ జట్టులోకి ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడు మరింత బలంగా పుంజుకోవాలి. మీరు మళ్లీ పైకి ఎదుగుతారనే నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు.