హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో సరస్వతీ పవర్ కేసుకు సంబంధించి జగన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది సమయం కోరారు.
విచారణను ఎన్‌సీఎల్‌టీ డిసెంబర్ 13కు వాయిదా వేసింది. సరస్వతీ పవర్ కంపెనీలో షేర్ల బదిలీపై ఎన్‌సీఎల్‌టీలో ఇటీవల జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా చేర్చారు.