అదనపు ఇంధన చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై మోపుతున్న ట్రూ అప్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యన్నారాయణమూర్తి డిమాండ్ చేశారు.
శ్రీకాకుళంలోని ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో శుక్రవారం మాట్లాడుతూ అదనపు ఇంధన ఛార్జీల పేరిట ట్రూ అప్ భారం ప్రతిపాదిస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయం అన్నారు.