బీసీసీఐ నిన్న క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా వారిలో 11 మందికి తొలి సారి అవకాశం లభించింది. గ్రేడ్-బిలో తొలిసారిగా యశస్వి జైస్వాల్ ఛాన్స్ కొట్టేసింది. అతనికి సంవత్సరానికి రూ. 3 కోట్లు. గ్రేడ్-సిలో రజత్ పాటిదార్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, ప్రసాద్ కృష్ణ మరియు రింకూ సింగ్ ఉన్నారు.
యువ ఆటగాళ్లకు బీసీసీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. రంజీలు ఆడకుండా మొండికేసిన ఇషాన్, శ్రేయాస్ ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుండి తప్పించింది. ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకుని దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారికి ఇది గట్టి హెచ్చరిక అని విశ్లేషకులు అంటున్నారు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న సీనియర్లు రంజీలు ఆడటం అనేది కష్టమే. అయితే, కుర్రాళ్లు కూడా అదే తీరున ఉండటం చాలా పెద్ద తప్పు అని అభిప్రాయపడుతున్నారు.