సాధారణంగా పండ్లు తింటే ఆరోగ్యానికు మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే. తాజాగా జరిగిన అధ్యయనంలో ఆసక్తికర విషయం బయట పడింది. పండ్లు తినడమే కాదు, పండ్ల వాసన పీల్చుకున్నా క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోగలదని అధ్యయనంలో తేలింది. పండ్ల వాసన పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని, ఇది క్యాన్సర్, నరాల సంబంధిత వైద్య చికిత్సలో ఉపయోగపడుతుందని పరిశోధకులు గుర్తించారు.
బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలు
బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బొప్పాయి రక్తపోటును నియంత్రిస్తుంది. కంటిచూపుకు బొప్పాయి దివ్య ఔషధంగా వైద్యులు చెబుతున్నారు. జుట్టు ఒత్తుగా పెరగడం, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కడుపులో మంట తగ్గుదల, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా బొప్పాయి సహాయపడుతుంది.