బ్రోకలీతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బ్రోకలీని డైట్ ప్లాన్‌లో ఉన్నవారు ఎక్కువగా తింటుంటారు. బ్రోకలీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గించటంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. బ్రోకలీలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
ఎండాకాలంలో వారు సోడా తాగడం ప్రమాదం:
ఎండాకాలంలో చాలామంది వేడి నుండి ఉపశమనం పొందేందుకు శీతలపానియాలు తాగుతారు. ఈ క్రమంలో సోడా తాగడానికి కొందరు ఇష్టపడతారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం సోడా అస్సలు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. సోడా అధికంగా తాగడం వల్ల రక్తపోటు, రక్తహీనత, ఎముకల వ్యాధి, గుండె జబ్బులాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.