నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఒక్కరోజు నిద్రపోకపోతే మరుసటి రోజు ఏ పనిమీదా ధ్యాసపెట్టలేం. అయితే చాలామంది రాత్రిపూట మాత్రమే నిద్రపోతారు. మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు అంటారు. అయితే మధ్యాహ్నం పూట చిన్న కునుకు తీయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.