బ్యాటరీలకు సంబంధించిన ప్రధాన సమస్య వాటి భద్రత. రకరకాల కారణాల వల్ల బ్యాటరీలు పేలిపోయే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారంగా ‘నీటి బ్యాటరీలు’ తయారుచేశారు.
వీటిని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే ఎలక్ట్రోలైట్‌ల బదులుగా వివిధ లవణాలు కలిపిన నీటిని వినియోగించడమే ఈ బ్యాటరీ ప్రత్యేకత.