వేసవికాలంలో మునక్కాయలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మునక్కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల.. సమ్మర్‌లో శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇంకా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అధిక చెమట, అలసట, సన్ స్ట్రోక్ వంటి సమస్యలు దరిచేరనీయదు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తాయి.