పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో లభించే పుదీనా ఆధారిత స్కిన్ ఆయిల్స్‌ని ఉపయోగించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. పుదీన సంబంధిత షాంపూలు వాడటం వల్ల చుండ్రు, చర్మసంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖానికి మింట్ ఫ్లేవర్ క్రీమ్స్ ని వాడితే ఉష్ణతాపం తగ్గి తాజాదనం వస్తుంది.