ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని AICTE ఎత్తివేసింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు అదనపు బ్రాంచిలకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలికసదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సుల ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తుండటంతో చాలా కళాశాలలు దరఖాస్తు చేశాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు భారీగా పెరగనున్నాయి. ఇప్పటివరకు ఒక్కో బ్రాంచిలో గరిష్ఠంగా 240 సీట్ల వరకు పరిమితి ఉండేది.