నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో వీటిని నిర్వహిస్తోన్న NTAపై సుప్రీంకోర్టు మండిపడింది. ఎక్కడైనా 0.001శాతం నిర్లక్ష్యం ఉన్నా..వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. NTA నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 8న చేపడతామని తెలిపింది.